‘యూ' సర్టిఫికెట్: 'గోపాల గోపాల' సెన్సార్ రిపోర్ట్..!


చూడండి:   పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌  కి సంబంధించిన గ్యాలరీలు | సినిమా వార్తలు | వీడియోలు 

Read This Post: In English

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. కుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమా కావడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. జనవరి 10న ‘గోపాల గోపాల' చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.విడుదల తేదీ ఖరారు కావడంతో ‘గోపాల గోపాల' మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అమెరికాలో ప్రీమియర్ షోలు భారీ సంఖ్యలో వేస్తున్నారు. యూఎస్ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 100కుపైగా స్క్రీన్లలో విడుదలవుతోంది.

గోపాల గోపాల బెనిఫిట్ షోలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ లోని బ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో బినిఫిట్ షో ప్లాన్ చేస్తున్నారు. టిక్కెట్లు కూడా అమ్మకానికి రెడీ అయ్యాయి. బ్రమరాంబ థియేటర్లో ఉదయం 5 గంటలకు, మల్లికార్జున థియేటర్లో ఉదయం 5.30 బెనిఫిట్ షో వేయబోతున్నారు. బాల్కనీ టికెట్ రేటు రూ. 3 వేల నుండి 5 వేలు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ క్లాస్ టికెట్ రేటు రూ. వెయ్యి నుండి 2 వేలు అంటున్నారు. ఇంత పెద్ద మొత్తం వసూలు చేయడం అన్యాయమని పేద ప్యాన్స్ అంటున్నారు.

 అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ‘గోపాల గోపాల’ మ్యూజిక్ ఆల్బంలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేసాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


చూడండి: ‘గోపాల గోపాల' సినిమా సంబంధించిన గ్యాలరీలు,సినిమా వార్తలు మరియు వీడియోలు