ఖరారు: ‘గోపాల గోపాల'10 న వస్తున్నాడు....!..అడ్వాన్స్ బుకింగ్..ఓపెన్‌..!


‘గోపాల గోపాల' చిత్రం జనవరి 9న విడుదల అవుతుందని అంతా అనుకుంటున్నాం. చిత్ర యూనిట్ కూడా గత కొన్ని రోజులుగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. కానీ తాజాగా ఓ ట్విస్ట్ పలకరించింది. ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలు లేటవడం వల్ల జనవరి 9న కాకుండా జనవరి 10 న విడుదల  ఖరారు చేసారు.చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైంది. సినిమాలో ఉన్నవి మూడు పాటలే అయినా రెస్పాన్స్ మాత్రం బావుంది. అన్ని సిచ్యువేషన్ సాంగులే కాబట్టి సినిమాకు ప్లస్సవుతుందని భావిస్తున్నారు. విడుదల తేదీ ఖరారు కావడంతో ‘గోపాల గోపాల' మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అమెరికాలో ప్రీమియర్ షోలు భారీ సంఖ్యలో వేస్తున్నారు. యూఎస్ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 100కుపైగా స్క్రీన్లలో విడుదలవుతోంది.

గోపాల గోపాల బెనిఫిట్ షోలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ లోని బ్రమరాంబ, మల్లికార్జున థియేటర్లలో బినిఫిట్ షో ప్లాన్ చేస్తున్నారు. టిక్కెట్లు కూడా అమ్మకానికి రెడీ అయ్యాయి. బ్రమరాంబ థియేటర్లో ఉదయం 5 గంటలకు, మల్లికార్జున థియేటర్లో ఉదయం 5.30 బెనిఫిట్ షో వేయబోతున్నారు. బాల్కనీ టికెట్ రేటు రూ. 3 వేల నుండి 5 వేలు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ క్లాస్ టికెట్ రేటు రూ. వెయ్యి నుండి 2 వేలు అంటున్నారు. ఇంత పెద్ద మొత్తం వసూలు చేయడం అన్యాయమని పేద ప్యాన్స్ అంటున్నారు.

చూడండి: ‘గోపాల గోపాల' సినిమా సంబంధించిన గ్యాలరీలు,సినిమా వార్తలు మరియు వీడియోలు 

'గోప���ల గోపాల' చిత్రానికి కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో పోసాని పాత్ర హైలెట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. హిందీ ఓ మై గాడ్ చిత్రం లో గోవింద నమోడె చేసిన ఈ పాత్రలో పోసాని కనిపించనున్నారు. ఈ పాత్రకు నేటివ్ టచ్ ఇచ్చి మరీ హైలెట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ కు థియోటర్ దద్దరిల్లుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. దొంగ స్వామీగా చేసిన పోసాని తనదైన స్పెషల్ డైలాగు డెలవరితో అదరకొట్టాడని, త్వరలో ఆయన డైలాగుతో టీజర్ వదిలే అవకాసం ఉందని అంటున్నారు. మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.

చూడండి:   పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌  కి సంబంధించిన గ్యాలరీలు | సినిమా వార్తలు | వీడియోలు