ఈ సారి ఏసు క్రీస్తుగా నాగార్జున ...కె.రాఘవేంద్రరావుతో..?!


దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో ఇప్పటికే అన్నమయ్యగా,శ్రీరామదాసుగా,షిరిడి సాయి గా భక్తిరస చిత్రాలు రూపొందించిన నాగార్జున మరో   భక్తిరస చిత్రం ఏసు క్రీస్తు  పాత్ర చేయబోతున్నట్లు ఫిలింనగర్‌ సమాచారం. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీసాయిబాబా వంటి భక్తి చిత్రాలు నాగార్జున కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ సినిమాలుగా అభివర్ణించవచ్చు.  ఈసారి వీరి కాంబోలో ఏకంగా జీసస్‌ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిగురించి ఏసు క్రీస్తు జీవితాన్ని ఆధారంగా తీసుకుని రాఘవేంద్రరావుగారు   స్క్రిప్టు వర్కు కూడా సిద్దం చేస్తున్నారట. మరీ ఈ పాత్రకు కింగ్‌ నాగార్జున అంగీకరిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

చూడండి: అక్కినేని నాగార్జున కి సంబంధించిన గ్యాలరీలు | సినిమా వార్తలు | వీడియోలు

ప్రస్తుతం నాగార్జున తన కొడుకు అఖిల్ తెరంగ్రేటం చేస్తున్న సినిమా పనులు దగ్గరుండి చేసుకుంటున్నారు. అఖిల్ తొలి సినిమా నిర్లక్ష్యం చేస్తే అతని కెరీర్ పై దెబ్బపడే అవకాశం ఉండటంతో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిత్రాన్ని వివి వినాయిక్ డైరక్ట్ చేస్తూండగా, నాగార్జున-నితిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2015 మే 1 నాటికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.