త్రిష: నా నిశ్చితార్థం ఈ నెల 23న..!గత కొంత కాలంగా త్రిష పెళ్లి విషయం మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ చెన్నై బ్యూటీ త్రిష త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. .. ఎట్టకేలకు ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పింది. జనవరి 23వ తేదీన వరుణ్ తో తన నిశ్చితార్థం జరగనున్నట్లు ట్విట్టర్ లో తెలిపింది. కేవలం తమ రెండు కుటుంబాలు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతాయని తన అభిమానులు, స్నేహితులకు తెలిపింది.అయితే తమ పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని, అందువల్ల దాని గురించి ఊహాగానాలు వద్దని కోరింది. ముహూర్తం ఖరారు కాగానే ఎప్పటిలాగే తానే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడిస్తానని త్రిష చెప్పింది. సినిమాలు వదిలిపెట్టాలన్న ఉద్దేశం ఏదీ తనకు లేదని, వాస్తవానికి రెండు కొత్త సినిమాలను కూడా తాను ఒప్పుకొంటున్నానని, 2015లో మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయని కూడా ట్విట్టర్ సందేశాలలో త్రిష చెప్పింది.

చూడండి: త్రిష కి సంబంధించిన హాట్ గ్యాలరీలు

2002 సంవత్సరంలో ‘లేసా లేసా’ అనే తమిళ చిత్రం ద్వారా సినీ కెరీర్‌ ప్రారంభించిన త్రిష అనతికాలంలోనే అగ్రతారగా గుర్తింపు పొందింది. వయసు మూడు పదులు దాటడడంతో ఇటీవల కాలంగా ఆమె వివాహానికి సంబంధించిన వార్తలు అధికంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిర్మాత వరుణ్‌ మణితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్‌లో ప్రత్యక్షం కావడం, ఇద్దరూ కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించడంతో మరోమారు త్రిష పెళ్లి వదంతులు కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేశాయి.