రామ్‌చరణ్‌- శ్రీనువైట్ల మరో కథానాయికగా నిత్యామీనన్‌..!


మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే సమంతను కథానాయికగా ఎంచుకున్నారు. మరో కథానాయికగా నిత్యామీనన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ చేస్తున్న త్రివిక్రమ్‌ ప్రాజెక్టులో నిత్యామీనన్‌ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే అప్పుడే మరో మెగా హీరో పక్కన నటించే అవకాశం రావడం నిత్యాకు అదృష్టమని చెప్పుకోవచ్చు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోతో ఓ హీరోయిన్‌ నటిస్తే ఆ వెంటనే మరో మెగా హీరోతో నటించడం అనవాయితీగా మారింది. ఉదాహరణకు కాజల్‌ ఆర్య-2లో అల్లు అర్జున్‌ సరసన చేసిన వెంటనే రామ్‌చరణ్‌ సరసన ‘ఎవడు, నాయక్‌, గోవిందుడు అందరివాడేలే’ చిత్రాల్లో నటించింది. అలాగే అమలపాల్‌ కూడా ‘ఇద్దరు అమ్మాయిలలతో బన్నీ పక్కన చేయగానే చరణ్‌తో నాయక్‌’ చేసింది. ఆ కోవలోకే మరో నటి తమన్నా ‘బద్రినాథ్‌తో అల్లు అర్జున్‌తో చేసి రచ్చ’లో రామ్‌ చరణ్‌తో జత కట్టింది. ఇప్పుడు కూడా నిత్యామీనన్‌తో అదే సిరీస్‌ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. 

చూడండి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్  కి సంబంధించిన గ్యాలరీలు | సినిమా వార్తలు | వీడియోలు 

 ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు ర���జాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.