సుధీర్ బాబు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'లో దగ్గుబాటి హీరోలు..!


 హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. ప్రేమ కథా చిత్రమ్ లో సుధీర్ తో జత కట్టిన నందిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఆర్.చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. హరి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని జనవరి 21న విడుదల చేయనున్నట్లు ఇది వరకే తెలియజేశాం.

ఇప్పటికే ఈ సినిమాలో ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అతిధి పాత్రలో నటించారు. ఆయన కాకుండా మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఈ సినిమాలో అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. వారే అక్కినేని నాగ చైతన్య, దగ్గుబాటి రానా.. నాగ చైతన్య, రానా ఈ సినిమాలో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో అతిధి పాత్రల్లో కనిపిస్తారు. ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథలకు పూర్తి భిన్నంగా ఉంటుందని డైరెక్టర్ చంద్రు తెలిపాడు. ఈ సినిమా కోసం జోగ్ ఫాల్స్ అంచుల వద్ద చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలలో సుధీర్ బాబు చేసిన రిస్కీ స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఈ చిత్ర టీం తెలిపింది. కన్నడంలో మంచి విజయం సాదించిన ‘చార్మినార్' ఈ చిత్రానికి మాతృక.

చూడండి: ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' కి సంబంధించిన గ్యాలరీలు | సినిమా వార్తలు | వీడియోలు