షాక్: ‘గోపాల గోపాల' సెన్సార్ వాయిదా ..!


చూడండి:   పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌  కి సంబంధించిన గ్యాలరీలు | సినిమా వార్తలు | వీడియోలు 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల' చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు(జనవరి 7) సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో సెన్సార్ వాయిదా పడింది. దీంతో సినిమా ఎట్టి పరిస్థితుత్లోనూ జనవరి 9 విడుదలయ్యే అవకాశం లేదు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 11 లేదా, జనవరి 14న విడుదలయ్యే అవకాశం ఉంది.రిలీజ్ డేట్ దగ్గర పడినా....టీవీ, వార్తా పత్రికల ప్రకటనల్లో డేట్ ఖరారు చేయడం లేదు. త్వరలో...త్వరలో అని తప్ప డేట్ మాత్రం కనిపించడం లేదు. దీంతో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందామని ప్రయత్నిస్తున్న అభిమానులు ప్రతి రోజు థియేటర్ల చూట్టూ తిరగాల్సి వస్తోంది. డేట్ ఖరారు కాని కారణంగా అడ్వాన్స్ బుకింగ్ ఇవ్వడం లేదు.

అలాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ‘గోపాల గోపాల’ మ్యూజిక్ ఆల్బంలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేసాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

చూడండి: ‘గోపాల గోపాల' సినిమా సంబంధించిన గ్యాలరీలు,సినిమా వార్తలు మరియు వీడియోలు