బుల్లి తెర మెగాస్టార్ ...గీత ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్షన్.....?


నటులుగా లేదా టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో ఎంటర్ అయ్యి ఆ తర్వాత డైరెక్టర్ గా మారిన వారిని చూస్తుంటాం కానీ బుల్లితెర నటుడుగా సక్సెస్ అయ్యి ఆ తర్వాత దర్శకులుగా మారిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు అదే జరగనుంది.. పాపులర్ (బుల్లి తెర మెగాస్టార్ అని పేరు వేసుకునే) టీవీ యాక్టర్ అయిన ప్రభాకర్ పాపులర్ బ్యానర్ అయిన గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా డైరెక్ట్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాలో అల్లు శిరీష్ నటించే అవకాశం కూడా ఉంది కానీ ఆ విషయంపై ఇంకా ఎలాంటి కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు.

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ప్రభాకర్ అనతి కాలంలోనే టీవీ సీరియల్స్ లో క్యారెక్టర్ రోల్స్ చేసాడు. ఆలాగే ఎన్నో సీరియల్స్ లీడ్ రోల్స్ చేసి బుల్లితెరపై ఎంతో ఫేమస్ అయ్యాడు. ఈ టీవీ సుమన్ తో కలిసి ఎన్నో సీరియల్స్ చేసిన ప్రభాకర్ జీ తెలుగులో వచ్చిన ‘ముద్దు బిడ్డ' సీరియల్ తో డైరెక్టర్ గా మారాడు. ఇప్పుడు ఓ సినిమాని డైరెక్ట్ చెయ్యడానికి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..