' గోపాలగోపాల ' రన్ టైమ్? పవన్ పాత్ర లెంగ్త్ ? ఏంతో తెలుసా..!


వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌కాంబినేషన్లో లో తెరకెక్కుతున్న చిత్రం ' గోపాలగోపాల ' . ఈ చిత్రం ఆడియో రెండు రోజుల క్రితం విడుదయ్యి...మంచి క్రేజ్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో శ్రీకృష్ణుడుగా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం ఒరిజనల్ హిందీ వెర్షన్ లో ఈ పాత్ర లెంగ్త్ చాలా తక్కువ ఉంటుది. దాంతో తెలుగులో ఎంత మేరకు పవన్ ఉండబోతున్నాడనేది అంతటా చర్చనీయాంసంగా మారింది. అయితే అందిన సమాచారం మేరకు పవన్ పాత్ర ఇంటర్వెల్ కు ఐదు నిముషాల ముందు ప్రవేశిస్తారు. ఇంటర్వెల్ ఆయన మీదే వేస్తారు.

చూడండి:   పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌  కి సంబంధించిన గ్యాలరీలు | సినిమా వార్తలు | వీడియోలు

సెకండాఫ్ లో దాదాపు సినిమా మొత్తం కనపడతారు. మొత్తం అంతా కలిపి ఓ గంట పవన్ ఉంటారని తెలుస్తోంది. ఈ చిత్రం రన్ టైమ్...రెండు గంటల ఇరవై నిముషాలు. అలాగే పవన్, వెంకటేష్ పై చిత్రీకరించిన పాట సినిమాలో హైలెట్ అవుతుందని అంటున్నారు. పవన్ చెప్పే డైలాగులపై ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నారని, అవి సినిమా రిలీజయ్యాక హాట్ టాపిక్ గా మారి, రింగ్ టోన్ లుగా వచ్చినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చూడండి: ‘గోపాల గో���ాల' సినిమా సంబంధించిన గ్యాలరీలు,సినిమా వార్తలు మరియు వీడియోలు