2015: తమిళ డబ్బింగ్ తో మంచి బోణి కొట్టిన తెలుగు ఇండ్రస్టి...!తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన ‘వేలఇల్లై పట్టదారి' సినిమా తెలుగులో ‘రఘువరన్ బిటెక్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. న్యూ ఇయర్ కానుకగా వచ్చిన ఈ సినిమా యువతని ఆకట్టుకొని బాక్స్ ఆఫీసు వద్ద బాగానే కాసులు వసూలు చేస్తోంది. కేవలం వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని కూడా రాబట్టుకుంటుంది. ధనుష్ సరసన అమలా పాల్ నటించిన ఈ సినిమా యువతని బాగా ఆకట్టుకుంటోంది.

ఒక డబ్బింగ్ సినిమా అయినప్పటికీ సినిమా అవడ్డ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటూ 2015 లో టాలీవుడ్ మొట్టమొదటి హిట్ గానిలిచింది. వేల్రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ తెలుగు ప్రేక్షకులకు అందించాడు. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ధనుష్ నటించిన ఈ సినిమా హిట్ అవ్వగానే తను నటించిన ‘ఆడుకలం' సినిమాని ‘పందెం కోళ్ళు'గా రిలీజ్ చేయనున్నారు.

చూడండి: ధనుష్ కి సంబంధించిన గ్యాలరీలు | సినిమా వార్తలు | వీడియోలు