షాక్ ఇచ్చిన హైకోర్టు: 'ఐ' సినిమా మరో మూడు వారాలకు వాయిదా......!


చూడండి: విక్రమ్‌ ‘ఐ' సినిమా కి సంబంధించిన గ్యాలరీలు | సినిమా వార్తలు  | వీడియోలు

శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా  తెరకెక్కిన 'ఐ' చిత్రం విడుదలకు ముందే ఎదురుదెబ్బ తగిలించింది. ఈ సినిమా విడుదల చేయొద్దని మద్రాస్ హైకోర్టు గురువారం ఆదేశించింది. దీంతో ఈ సినిమా మూడు వారాలు ఆలస్యంగా విడుదలకానుంది.ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని అనుకున్నారు. తర్వాత రిలీజ్ డేట్‌ను 14కు మార్చారు. పండగ నాడే సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే 'ఐ' సినిమా విడుదలకు ఇప్పుడు హైకోర్టు బ్రేకులు వేసింది. అయితే 'ఐ' చిత్రం 14న యధావిధిగా విడ��దలవుతుందని ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు.ఇప్పటికే అన్ని పనులూ పూర్తి చేసుకున్న శంకర్ విజువల్ వండర్ 'ఐ' మీద దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. హీరో విక్రమ్‌ను విభిన్న రూపాల్లో చూపించే ఈ చిత్రం ఏకంగా మూడేళ్ళుగా నిర్మాణంలో ఉండడం విశేషం.

అయితే సినిమా స్టోరీలైన్, కాన్సెప్టు బయటకు రావడానికి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న పిసి శ్రీరామ్ అనే వదంతులు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పొరపాటును ఆయన బయట పెట్టాడని అంటున్నారు. అయినా దీని వల్ల పెద్దగా సమస్య ఏమీ ఉండనది అంటున్నారు యూనిట్ సభ్యులు.కాగా...ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదలైన కేవలం 8 రోజుల్లోనే యూట్యూబులో 5 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది. అత్యధిక హిట్స్ సొంతం చేసుకున్న ట్రైలర్ గా ఈ ట్రైలర్ రికార్డు సృష్టించింది. అత్యధిక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాగా కూడా ఈ చిత్రం టాప్ పొజిషన్లో ఉంది.

దర్శకుడిగా ఇంత వరకూ ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇపుడు చియాన్ విక్రమ్ హీరోగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ ఫిలింస్ అధినేత వి.రవిచంద్రన్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ విజువల్ వండర్‌ను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైలిమిటెడ్ సంస్థ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చియాన్ విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈచిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.