కృష్ణంరాజు పర్సు చోరీ..!


 ప్రముఖ సినీ నటుడు,  కృష్ణంరాజు పర్సును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆగంతకులు దొంగిలించారు. పర్సులో పలు క్రెడిట్ కార్డులతోపాటు భారీగా నగదు ఉన్నట్లు ఆయన గురువారం తెలిపారు. గత రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ విచ్చేశారు.ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీకి చెందిన నేతలంతా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అమిత్ షా కు స్వాగతం పలికే క్రమంలో కృష్ణంరాజు ప్యాంట్ జేబులోని పర్సును ఆగంతకులు చోరీ చేశారు..