కోన వెంకట్ కు 30 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రుద్వి గిఫ్ట్..!


30 ఇయర్స్  ఇండస్ట్రీ  ప్రుద్వి ప్రముఖు రచయత కోన వెంకట్ కు గిఫ్ట్ ఇచ్చాడు. ప్రుద్వి కు లౌక్యం లో బాయిలింగ్‌ స్టార్‌ అనే రోల్ క్రియట్ చేసిన కోన వెంకట్ కు గిఫ్ట్ గా తను స్కచ్ గీచిన బోమ్మను ఇచ్చాడు.30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.. అంటూ ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క డైలాగ్తో ప్రేక్షకుల హృదయాలను చకిలగింతలు పెట్టిన నటుడు పృథ్వీరాజ్ . గోపిచంద్ హీరోగా తాజా విడుదలైన 'లౌక్యం' చిత్రంలో పృథ్వీరాజ్ టీవీ యాంకర్ పాత్రలో ఒదిగిపోయారు. 'బాయిలింగ్ స్టార్ బబ్లూ' పాత్రలో పృథ్వీ ఇరగదీశాడంటూ అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ పాత్రలో ఒదిగిపోయి తీరు... డైలాగులు పలికిన విధానంతోపాటు నటన అద్భుతంగా ఉన్నాయని పృథ్వీని సీని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు.పృథ్వీ పాత్ర లౌక్యం చిత్రానికే హైలైట్.